Sarvai Papanna Jayanti | వీణవంక, ఆగస్టు 18: వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను గీతకార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో సర్వాయి పాపన్న సంఘం మండలాధ్యక్షుడు తిప్పని సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
పోరాట యోధుడు సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు తిప్పని సమ్మయ్యగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పైడిమల్ల శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి బుర్ర రాములుగౌడ్, గౌరవాధ్యక్షులు పల్లె రాజమల్లుగౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొంగోని రాజయ్య, నియోజకవర్గ ప్రెసిడెంట్ నల్లగోని రాజారాం, మండల ఉపాధ్యక్షులు మ్యాడగోని మొగిలి, పోతిరెడ్డిపల్లి గ్రామశాఖ అధ్యక్షులు చేపూరి మొగిలి, సభ్యులు రాపర్తి సతీష్, మ్యాడగోని శ్రీనివాస్, తాళ్ళపెల్లి రాజు, తిప్పని మొగిలి, మార్క సంపత్, ఒల్లాల శ్రీకాంత్ గౌడ్, మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.