Collector Pamela Satpati | కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్ట్ 18 : సామాజిక సమానత్వానికి కృషిచేసిన సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారుకలెక్టరేట్ ఆడిటోరియంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి కలెక్టర్ పమేలా సత్పతి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న కుల వ్యవస్థ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారని, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారని అన్నారు. ఆయన విషయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ పాపన్న ఆనాటి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రజలలో పోరాట పటిమ పై దశ, దిశ, నిర్దేశం చేశారని అన్నారు. సర్వాయి పాపన్న అట్టడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి కృషి చేశారని, కోటలు కట్టించారని, సాగునీటి మీద పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, జిల్లా రెవిన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి గుగ్గిళ్ళ శ్రీనివాస్ గౌడ్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల స్వామి గౌడ్, పట్టణ అధ్యక్షుడుదూలం అంజయ్య, రాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్, బుర్ర ముత్తయ్యా గౌడ్, తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్, మార్క్ రాజు గౌడ్, పురుషోత్తం ,ఆశిష్ గౌడ్, సాగర్ గౌడ్, అనిల్ గౌడ్ గనగోని సత్యం, బండారి గాయిత్రి, శరణ్య, ఉయ్యాల శ్రీనివాస్ , బైరీ రాజు గౌడ్, బీసీ సంఘం నాయకులు శ్రీధర్, నేరుమట్ల మల్లేశం పాల్గొన్నారు.