Peddapally | కాల్వశ్రీరాంపూర్ జూన్ 21 : మండల కేంద్రంలోని నీలకంఠ చెరువు కట్టపై విపరీతంగా తుమ్మలు పిచ్చి మొక్కలు దారి కి అడ్డంగా మొలిచి రైతులకు దారి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై నీలకంఠ చెరువు ఆయకట్ట రైతులు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడు కు చెరువు కట్టపై ఏపుగా పెరిగిన తుమ్మలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ రైతులతో కలిసి చెరువుకట్టపై పెరిగిన తుమ్మలను పరిశీలించారు. ఉపాధి హామీ పనులతో గాని, ఎలాంటి ప్రభుత్వ నిధులతో గాని ఈ తుమ్మల తొలగించడానికి వీలు లేకపోవడంతో సారయ్య గౌడ్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో తన సొంత ఖర్చులతో ఎక్స్ వేటర్ ద్వారా చెరువు కట్టపై తుమ్మలను తొలగించారు. చెరువు కట్టపై తుమ్మలు పిచ్చి మొక్కలను తొలగించిన మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ కు నీలకంట చెరువు ఆయకట్టు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.