Degree College | కోరుట్ల, మే 24: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా సందీప్ నియమితులయ్యారు. ప్రస్తుతం అదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఎఫ్ఎసి (పూర్తి అదనపు బాధ్యతలు) ప్రిన్సిపాల్ గా నియమిస్తూ కళాశాల విద్య కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు ఆయన శనివారం బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సందీప్ ను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.