Sakhi Centers | సిరిసిల్ల టౌన్, మే 13: మహిళల సమస్యల పరిష్కారానికి సఖీ సెంటర్లు పనిచేస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతి రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ ను ఆమె మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సఖీ సెంటర్ ను పరిశీలించి అక్కడ ఉన్న మహిళలతో కాసేపు ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా సఖీ సెంటర్లు ఏ విధంగా పనిచేస్తున్నాయో నేషనల్ ఉమెన్స్ కమిషనర్ ఆదేశాల మేరకు సఖీ సెంటర్ ను పరిశీలించినట్లు తెలిపారు.
మహిళలకు ఏ అర్ధరాత్రి సమస్య వచ్చినా ఒక్క ఫోన్ కాల్ తో సఖీ సెంటర్ స్పందిస్తుందని పేర్కొన్నారు మహిళల సమస్యల పరిష్కారానికి సెంటర్ బ్రహ్మాండంగా పనిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సఱై సెంటర్లు సక్సెస్ ఫుల్ గా పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.