Women Leader Shif | కోరుట్ల, ఆగస్ట్ 4 : కోరుట్ల పట్టణానికి చెందిన తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, వెల్ఫేర్స్ అసోసియోషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు మ్యాకల సాయిశ్వరీ బహుజన సాహిత్య అకాడమీ ‘ఉమెన్ లీడర్ షిప్’ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈమేరకు హైద్రాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆకాడమీ జాతీయ అధ్యక్షుడు రాధాకృష్ణ చేతుల మీదుగా ఆమె అవార్డు ఆహ్వన పత్రాన్ని సోమవారం అందుకున్నారు.
సెప్టెంబర్ 5న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించే బహుజన సాహిత్య అకాడమీ 18వ నేషనల్ కాన్ఫరెన్స్లో ఆవార్డును అందుకోనున్నట్లు సాయిశ్వరి తెలిపారు. కార్యక్రమంలో బీఎస్ఏ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ విష్ణు, కమిటీ సభ్యులు వెంకటేశం, విజయ్ కుమార్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.