Sagara Sangam | వీణవంక : సగరుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర కోరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్బాబును సగర సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల హుజురాబాద్ మండలంలోని కనుకులగిద్ద గ్రామ కుల సంఘం భవనానికి రూ.5లక్షలు మంజూరు చేయించినందుకు శాలువా కప్పి, పూల మొక్క అందజేశారు. నిధుల మంజూరుకు కృషి చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే వీణవంక మండలంలోని రెడ్డిపల్లి, కొత్తపల్లి, శ్రీరాములపేట, వల్బాపూర్, జమ్మికుంట, హుజురాబాద్ పట్టణాలల్లో సగర సంఘం భవనాలకు భూమి కేటాయించడంతో పాటు ప్రత్యేకమైన నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఏరుకొండ ప్రసాద్ సగర, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ మండల అధ్యక్షుడు, సగర సంఘం నాయకుడు కొల్లూరి కిరణ్ సగర, కొత్తపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు గుంటి రాజయ్య సగర, సగర సంఘం నాయకులు కుర్మిండ్ల సుఖేష్ సగర, బొడిపెల్లి కుమార్ సగర, గుంటి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.