Sagara Sangam | జమ్మికుంట : జమ్మికుంట పట్టణానికి చెందిన చిదురాల శంకరయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న కరీంనగర్ జిల్లా సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టరాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి సగర తదితర నాయకులు గురువారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా మృతుడి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయన మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సగర సంఘం నాయకులు కుర్మిండ్ల అశోక్‌కుమార్, చిదురాల రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.