Veenavanka | వీణవంక, సెప్టెంబర్ 3: వీణవంక మండల కేంద్రంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం కుంకుమ పూజ నిర్వహించి అనంతరం అన్నప్రసాదాల వితరణ నిర్వహించారు. కాగా ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షుడు మర్రి రవి యాదవ్, మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్, ముషికే ఐలయ్య, శ్రీనివాస్, రంజిత్, చిన్నాల శ్రీకాంత్, గెల్లు సందీప్, కౌశిక్, ఆదిత్య, వంశీ, రాకేష్, గెల్లు సమ్మయ్య, గెల్లు రమేష్, నాగరాజు, మేడుదుల నాగరాజు, మేడుదుల రాహుల్, శంకర్, మల్లెత్తుల సదానందం, తొట్ల రాకేష్, నాయీమ్, సాయి, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.