రైతు బీమాలో చేరండహో..
రైతు బీమాలో కొత్తగా చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2018 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద ఐదేళ్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మరణించిన 8190 రైతులకు సంబంధించి వారి కుటుంబాలకు రూ.409.50 కోట్ల ఆర్థికసాయం చేసి అండగా నిలిచింది.
- నేటి నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తుల స్వీకరణ
- ఏఈవోలను సంప్రదించాలంటున్న అధికారులు
- ఇప్పటికే 8190 కుటుంబాలకు లబ్ధి
- రూ.409.50 కోట్ల ఆర్థికసాయం
- అండగా నిలుస్తున్న పథకం
రైతు బీమాలో కొత్తగా చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2018 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద ఐదేళ్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మరణించిన 8190 రైతులకు సంబంధించి వారి కుటుంబాలకు రూ.409.50 కోట్ల ఆర్థికసాయం చేసి అండగా నిలిచింది. బీమాలో కొత్తగా చేరే వారికి ఈ నెల 10నుంచి ఆగస్టు 14 నుంచి అమలులోకి రానున్నది. అయితే, కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు ఈ పథకంలో చేరేందుకు ఈ నెల 10 నుంచి వచ్చే నెల 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. 18 సంవత్సరాలు నిండి, 59 ఏండ్ల లోపు ఉన్న వారు మాత్రమే ఇందుకు అర్హులని తెలిపింది.
కరీంనగర్, జూలై 9 (నమస్తే తెలంగాణ): అకాల మరణం పొందిన రైతు కుటుంబాలకు రైతుబీమా పథకం కొండంత అండగా నిలుస్తోంది. రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా పథకాన్ని 2018 నుంచి అమలు చేస్తోంది. 18 నుంచి 59 ఏండ్ల వయసు ఉన్న రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు కాగా, రైతుల కోసం ఎల్ఐసీకి ప్రభుత్వమే ఉచితంగా ప్రీమియం చెల్లిస్తోంది.
ఈ పథకంలో చేరిన రైతులు ఏ కారణం చేతనైనా మరణించినట్లయితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున బీమా వర్తించేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఐదేళ్లుగా అమలువుతున్న ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 8190 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ.409.50 కోట్ల సా యం అందించింది. ఈ పథకం కింద వచ్చిన మొ త్తం సాయం ఆయా కుటుంబాలకు ఎంతో ఆసరా అవుతోంది. అప్పులు తీర్చుకోవడం, పిల్లలను చదివించుకోవడం, వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం వంటి పనులకు ఉపయోగించుకుంటున్నారు. గతంలో మాదిరిగా రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు లే కుండా పోయాయి. రైతు మరణించిన వారం పది రోజుల్లోనే రైతు బీమా చెక్కులు అందిస్తుండటం తో రైతు కుటుంబాలకు భరోసా దొరుకుతున్నది.
కొత్త రైతులు చేరేందుకు అవకాశం
రైతు బీమా పథకం ఆరో ఏడాదిలోకి అడుగు పెడుతోంది. ప్రతి ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి అమలవుతు న్నది. ఇప్పటికే రైతు బీమాలో ఉన్న రైతుల్లో 59 ఏండ్లు దా టిన వారిని తొలగిస్తారు. కొ త్తగా రైతు పట్టాదారు పాసు పు స్తకాలు పొందిన అర్హులైన రైతులను చేర్చుకుంటారు. 20 23-24లో చేరుతున్న రైతులకు ఆగస్టు 14 నుంచి ఈ పథకం వర్తిస్తుంది. అయితే, 18 నుంచి 59 ఏం డ్లు ఉన్న అంటే 1964 నుంచి 2005 ఆగస్టు 14 వరకు జ న్మించిన వారికి మాత్రమే ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంటుంది.
జిల్లాలో గత జూన్ 18 నాటికి పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులను రైతు బీమా పథకంలోకి తీసుకుంటారు. వీరంతా బీమా పథకంలో చేరాలంటే రైతు బీ మా దరఖాస్తు ఫారంతో పాటు పట్టాదారు పాసు పుస్తకం, రైతు ఆధార్ జిరాక్స్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతులతో స్వయంగా సంబంధిత రైతే వచ్చి వ్యవసాయ అధికారులకు అందించాలి. రైతుకు బదులుగా మరొకరు వచ్చి దరఖాస్తు ఇచ్చినట్లయితే స్వీకరించబడదని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 10 నుంచి ఆగస్టు 5 వరకు సం బంధిత ఏఈవోలకు, వారు అందుబాటులో లేనట్లయితే సం బంధిత మండల వ్యవసాయ అధికారులకు అం దించాలని చెబుతున్నారు. ఇప్పటి వరకు రైతు బీమాలో ఉన్న రైతు లు తమ ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు జరి గి ఉంటే సవరించుకునే అవకాశం కూడా ఇచ్చా రు. నామినీ మరణించినా సవరించుకోవచ్చు. స్వ యంగా మార్పులు చేసుకోవాలని అనుకునేవారు కూడా వ్యవసాయ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. కాగా, కరీంనగర్ జిల్లాలో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు 11,139 మంది ఉన్నారు.
కరీంనగర్ జిల్లాలో 2,413 కుటుంబాలకు లబ్ధి
కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 2413 కుటుంబాలకు రూ.120.65 కోట్ల ఆర్థిక సాయం అందింది. 2018-19లో మరణించిన 363 మందికి రూ.18.15 కోట్లు, 2019-20లో మం దికి రూ.23.60 కోట్లు, 2020-21లో మరిణించిన 735 మందికి 36.75 కోట్లు, 2021-22 మరణించిన 473 మందికి రూ.23.65 కోట్లు, 2022-23లో ఇప్పటి వరకు 370 రైతులకు సం బంధించి వారి కుటుంబాలకు రూ.18.50 కోట్ల చొప్పున మొత్తం 120.65 కోట్లు పంపిణీ చేశారు.
మేలు చేకూర్చే పథకం..
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులంతా పథకంలో చేరాలి. రైతులందరికీ ఏఈఓలు అందుబాటులో ఉంటారు. ఏఈవోలు లేకపోతే మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. రైతు రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే ఎల్ఐసీకి ప్రీమియం చెల్లిస్తుంది. పథకాన్ని 18-59 ఏండ్లు ఉన్న రైతులంతా వినియోగించుకోవాలి. ఇది ఎంతో మేలు చేకూర్చే పథకం.
– వాసిరెడ్డి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి, కరీంనగర్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

