Peddapally | పెద్దపల్లి టౌన్, జూన్ 19 : పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామపంచాయతీ పరిధిలోని పేరపల్లి తమ పట్టా నాలుగెకరాల 20 గుంటల భూమిని అధికార కాంగ్రెస్ పార్టీ రాఘవాపూర్ మాజీ సర్పంచ్ వెంకటేశం మతిస్థిమితం లేని తన భర్త రాజు శంకరయ్య నుండి తప్పుడు ధృవపత్రాలు సృష్టించి పేరపల్లి గ్రామానికి చెందిన రాజు సుశీల జిల్లా కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య శరణ్యమని ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాతో సుశీల కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు గురువారం నిరసన చేశారు.
ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ సింగరేణిలో కొంతకాలం తన భర్త శంకరయ్య పనిచేసి పదవి విరమణ అనంతరం తమ సొంత గ్రామం సభ్యునికి వచ్చిన నివసిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తను మతిస్థిమితం లేకుండా తిరగడాన్ని గుర్తించిన మాజీ సర్పంచ్ అరకు వెంకటేశం తనతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆవేదన చెందారు. కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి ఆ భూమిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టగా అధికార కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ అడేపు వెంకటేశం రెవెన్యూ అధికారులకు లంచం ఇచ్చి పట్టా చేయించుకున్నాడని ఆరోపించారు.