Veenavanka | వీణవంక, నవంబర్ 12 : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.12 వందల కోట్ల ఎక్స్రేషియాను విడుదల చేసి గీతకార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పరుశరాములు గౌడ్ డిమాండ్ చేశారు. మండలంలోని ఎలుబాక గ్రామానికి చెందిన నల్లగోని కొమురయ్య గౌడ్ ఇటీవల తాటిచెట్టుపై నుండి పడి మృతిచెందగా రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పరుశరాములు గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దొమ్మటి రాజమల్లు గౌడ్, నాయకులు వారి కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడు కొమురయ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్రేషియా ఇవ్వాలని, గీతకార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు తిప్పని సమ్మయ్యగౌడ్, నియోజకవర్గ అధ్యక్షులు నల్లగోని రాజారాంగౌడ్, ఉపాధ్యక్షుడు చేపూరి మొగిలి, మండల గౌరవాధ్యక్షుడు పల్లె రాజమల్లు, కోశాధికారి బుర్ర రాములు, నాయకులు తిప్పని సదయ్య, వొల్లాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.