కోరుట్ల, మార్చి 28 : మీ డబ్బులు పడిపోయాయని దృష్టిని మరల్చిన దుండగులు, బ్యాంకు ముందే సినీఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. బైక్ కవర్ నుంచి 1.50 లక్షలు ఎత్తుకెళ్లారు. కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. అయిలాపూర్‌కు చెందిన చింతకింది శ్రీహరి, తన మిత్రుడితో కలిసి శుక్రవారం కోరుట్లలోని ఎస్బీఐ బ్యాంకులో 1.50 లక్షల నగదు విత్‌డ్రా చేసుకుని బయటకు వచ్చాడు. ఆ డబ్బులను తన బైక్ కవర్లో ఉంచాడు. ఇదంతా గమనిస్తున్న ఓ నలుగురు దుండగులు ఆ నగదును కాజేసేందుకు పన్నాగం పన్నారు. శ్రీహరి తన బైక్‌ను తీసుకొని వెళ్లే క్రమంలో ఓ వ్యక్తి అతడి వద్దకు వచ్చి.. పక్కనున్న బైక్ వద్ద మీ నగదు కింద పడిపోయాయని దృష్టి మరల్చాడు.
దాంతో శ్రీహరి బైక్ దిగి అక్కడకు వెళ్లి డబ్బులు తీసుకునే సమయంలో.. అక్కడే మరో బైక్‌పై ఉన్న దుండగుడు శ్రీహరి బైక్ కవర్లో ఉన్న డబ్బులను తీసుకొని పారిపోయాడు. డబ్బులు పడిపోయాయని చెప్పిన వ్యక్తి కూడా అక్కడి నుంచి జారుకున్నాడు. తర్వాత శ్రీహరి తన బైక్ వద్దకు వచ్చి చూడగా కవర్లోని డబ్బులు కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలిలో సీసీకెమెరా ఫుటేజీని పరిశీలించారు. నిందితుల కదలికలు, అనుమానితుల ఫొటోలను విడుదల చేశారు. నిందితులు కనిపిస్తే తన సెల్ నంబర్‌కు (8712656790) కాల్ చేయాలని ఎస్ఐ సూచించారు.