Peddapally | పెద్దపల్లి రూరల్ డిసెంబర్ 21 : దేశ రక్షణలో అనుక్షణం కృషిచేసిన పదవీ విరమణం అనంతరం అదే సేవా గుణంతో అనునిత్యం తపన పడుతూ సొంతూరికి చేరి తాను పుట్టిపెరిగిన గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి సొంత ఊరును చరిత్రలో అగ్రబాగాన ఉంచాలన్న పట్టుదలతో గ్రామంలోని అన్ని పార్టీలను, వర్గాలను, కులాల మద్దతును కూడగట్టి తన సతీమణి రోజారాణి యాదవ్ ని గ్రామానికి ప్రథమ పౌరురాలిగా గెలిపించుకున్నారు.
ఉప్ప సర్పంచిగా జంగిలి శేఖర్ యాదవ్ పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి యువకిషోరం, యాదవ జాతి రత్నం మేకల విజయ్ యాదవ్ని చిరుసత్కారంగా పెద్దపల్లి పట్టణంలో ఘనంగా శాలువాలు కప్పి సన్మానించిన అభిమాన సంఘం నాయకులు. అలాగే రాగినేడు ఉపసర్పంచ్ గుమ్మడి సోని విజయ్ ను సన్మానించారు. ఆత్మీయ అభిమాన సంఘం నాయకులు సూత్రపు పరమేష్, కీర్తి రాజయ్య మేరు, కాల్వ గట్టయ్య యాదవ్ తదితరులు పూలమాలలు శాలువాలతో పెద్దపల్లి లో ఘనంగా సన్మానించి సోమవారం జరుగబోయే పంచాయతీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.