ఎంత పనాయె కొడుకా..?
మానకొండూర్‌లోని అత్తారింటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సిల్ల శేఖర్ (29) చికిత్స పొందుతూ మృతిచెందగా, అలుగునూర్‌లో విషాదం నెలకొన్నది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్‌కు చెందిన సిల్ల శేఖర్ (29) ఆదివారం రాత్రి బైక్‌పై మానకొండూర్‌లోని అత్తారింటికి బయలుదేరాడు. ఈ క్రమంలో సదాశివపల్లి సమీపంలో రేవతి రైస్ మిల్లు వద్దకు చేరుకోగానే కరీంనగర్ వైపు వస్తున్న వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. శేఖర్‌కు తీవ్ర గాయాలుకాగా, వెంటనే 108 వాహనంలో అపోలో రీచ్ దవాఖానకు తరలించా రు
- సిల్ల శేఖర్ మృతదేహంపై పడి తల్లిదండ్రుల రోదనలు
- రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి
- అలుగునూర్‌లో విషాదం
మానకొండూర్ రూరల్, జనవరి 9: మానకొండూర్‌లోని అత్తారింటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సిల్ల శేఖర్ (29) చికిత్స పొందుతూ మృతిచెందగా, అలుగునూర్‌లో విషాదం నెలకొన్నది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్‌కు చెందిన సిల్ల శేఖర్ (29) ఆదివారం రాత్రి బైక్‌పై మానకొండూర్‌లోని అత్తారింటికి బయలుదేరాడు. ఈ క్రమంలో సదాశివపల్లి సమీపంలో రేవతి రైస్ మిల్లు వద్దకు చేరుకోగానే కరీంనగర్ వైపు వస్తున్న వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. శేఖర్‌కు తీవ్ర గాయాలుకాగా, వెంటనే 108 వాహనంలో అపోలో రీచ్ దవాఖానకు తరలించా రు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ రాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తండ్రి లస్మయ్య ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శేఖర్‌కు భార్య శారద, కొడుకులు ఆయు ష్(4), సహసృ (2) ఉన్నారు.
మాకెవరు దిక్కు కొడుకా..?
అలుగునూర్‌కు చెందిన సిల్ల ఓదవ్వ-లస్మయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు. అందులో ఒకరు క్యాన్సర్‌తో మృతిచెందగా, సిల్ల శేఖరే ఇంటికి పెద్ద దిక్కుగా మారాడు. శేఖ ర్ మానకొండూర్‌కు చెందిన శారదను వివాహం చేసుకోగా ఇద్దరు కొడుకులు. అయి తే ఆదివారం అత్తారింటికి వెళ్తుండగా జరిగిన దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతూ మృ తి చెందాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు హర్వెస్టర్, ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనోపాధి పొం దడమే కాదు వ్యవసాయం చేస్తున్న తల్లి దండ్రులకు, కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహం ఇంటికిరాగా తల్లిదండ్రులు, భార్య మృ తదేహంపై పడి ‘ఎంత పనాయె.. మాకెవరు దిక్కు’ అంటూ రోదించిన తీరు గ్రామస్తులను కలిచివేసింది. ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉన్న ఇద్దరు పిల్లలను చూసి బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

