పెద్దపల్లి, అక్టోబర్ 31: రైస్ మిల్ ఇండస్ట్రీకి సీఎం కేసీఆర్ అండగా ఉంటారని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్, పెద్దపల్లి నియోజక వర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి సర్దార్ రవీందర్‌సింగ్ రైస్ మిల్లర్లను కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి రవీందర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్‌సింగ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ సాగు నీరు, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో రైస్ మిల్ ఇండస్ట్రీ అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. రైస్ మిల్లర్లకు సమస్యలుంటే పరిష్కరించేందుకు బీఆర్ఎస్ సర్కారు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. సమైక్య పాలనలో కుదేలైన రైస్ మిల్ ఇండస్ట్రీకి చేయూతనందించే విధంగా సీఎం కేసీఆర్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. బీఆర్ఎస్ రైస్ మిల్లర్లకు ఎప్పుడు అండగా ఉంటుందని, పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. ఆత్మీయ సమ్మేళనంలో పెద్దపల్లి రైస్ అసోసియేషన్ నాయకులు దేవేందర్ రెడ్డి, అశోక్, రమణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సీ సత్యనారాయణరెడ్డి, వేముల రాంమ్మూర్తి, గుంజపడుగు హరిప్రసాద్, పెండ్యాల మహేశ్, కెమసారం తిరుపతి పాల్గొన్నారు.
రైస్‌మిల్ ఇండ్రస్టీని కాపాడింది సీఎం కేసీఆరే
రైస్ మిల్లర్ల సంక్షేమం, ఇండస్ట్రీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఎలాంటి బ్యాంకు గ్యారెంటీ లేకుండా కేవలం తెల్ల కాగితం మీద రాసి ఇస్తేనే ధాన్యాన్ని ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికే దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో నియోజకవర్గంలో రెండు పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గంలోనే రైస్‌మిల్లులు అధికంగా ఉన్నాయి. సమైక్య పాలనలో ఎలాంటి ప్రోత్సాహం అందించలేదు. ఎన్నో కష్టాలను అనుభవించాం. స్వరాష్ట్రంలో రైస్‌మిల్ ఇండ్రస్టీని కాపాడింది సీఎం కేసీఆరే. ఈ విషయాన్ని మరిచిపోవద్దు. బీఆర్ఎస్కు అండగా నిలువాలి. మరోసారి కేసీఆర్‌ను సీఎం చేయాలి.
– దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి