SGF Games | కోరుట్ల, ఆగస్టు 23 : కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి ఎస్జీఎఫ్ గేమ్స్ నిర్వహణపై పీడీ, పీఈటీలతో మండల విద్యాధికారి గంగుల నరేషం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ ప్రవేట్ పాఠశాల చెందిన విద్యార్థులకు నిర్వహించే మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 9న అండర్ 14, అండర్ 17, బాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు, 10న అండర్ 14 అండర్ 17 బాలురకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. 11న బాలికలకు, బాలురకు అథ్లెటిక్స్ పోటీలు అన్ని విభాగాల వారికి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు మండల ఎస్జీఎఫ్ కన్వీనర్ అశోక్, బాయ్స్ హైస్కూల్ పీడీ (9948765002), ఐలాపూర్ పీడీ విజయ్ కుమార్(9951518737) నంబర్ల నందు సంప్రదించాలని సూచించారు.