కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 7 : శాతవాహన విశ్వవిద్యాలయం, హెచ్ఆర్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్‌యూలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించగా, అనూహ్య స్పందన లభించింది. ముఖ్య అతిథులుగా విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, అధ్యక్షులుగా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్ హాజరై ప్రారంభించారు.
మేళాలో 2649 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 427 మందికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందజేశారు. అలాగే, మరో 845 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ ఎస్‌యూ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం వరప్రసాద్, ప్లేస్మెంట్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, 50 సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.