Kolanur Railway station | ఓదెల, నవంబర్ 21: పెద్దపెల్లి జిల్లా కొలనూరు రైల్వే స్టేషన్ లో పలు రైలను ఆపేలా చూడాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ముఖ్య కూడలిగా ఉన్న కొలనూర్ రైల్వే స్టేషన్ లో పలు ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ ఇవ్వాలని స్థానిక నాయకులు శుక్రవారం రాత్రి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
కొలనూరులో కాగజ్నగర్, హాజిని, తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ చేయించేలా చూడాలని కోరారు. కొలనూరు గ్రామానికి ఓదెల, పెద్దపల్లి, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలకు సౌకర్యంకారంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కొలనురు రైల్వే గేట్ సమీపంలో ఉన్న (మోరి) అండర్ బ్రిడ్జి నుంచి వాహనాలు వెళ్లే విధంగా అనుమతించాలని విన్నవించారు.
ఇందుకు ఎంపీ వంశీకృష్ణ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్ అనుమాస శ్రీనివాస్(జీన్స్), కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి రవి గౌడ్, మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్, నాయకులు దొడ్డే శంకర్, సాతురి రవి, ఓయూ జేఏసీ నాయకుడు జక్కుల మధు యాదవ్ పాల్గొన్నారు.