Retired Employees | వేములవాడ, జనవరి 1: ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలను ఇప్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు గురువారం వేములవాడలో రిటైర్డ్ ఉద్యోగులు వినతిపత్రం అందజేసి కోరారు. తాము ఉద్యోగ విరమణ పొంది 22 మాసాల అవుతున్నందున రావాల్సిన బకాయిలు ప్రభుత్వం నుండి అందకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే 42 మంది ఆవేదనతో ఉద్యోగులు మృతి చెందారని కూడా తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమ బకాయలు ఇప్పించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రిటైర్మెంట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జనపాల వెంకటయ్య, డివిజన్ కన్వీనర్ ధర్మయ్య, కో కన్వీనర్ తిరుపతి, శ్రీనివాస్, చక్రపాణి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.