Kondapaka | వీణవంక, జూన్ 22 : వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి పేరుమీద ఉన్న ఇసుక క్వారీని కొండపాకకు మార్చాలని కొండపాక ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రాను కోరారు. ఈ మేరకు వారు సోమవారం ప్రజావాణి కలెక్టర్ చిత్రమిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండపాక రెవెన్యూ పరిధిలోని మానేరువాగుపై ఇసుక క్వారీ ఏర్పాటు చేసి పోతిరెడ్డిపల్లి పేరు మీద నడుపుతున్నారని అన్నారు. దీంతో కొండపాక గ్రామస్తులమైన తాము ఉపాధి కోల్పోతున్నామని, పోతిరెడ్డిపల్లి నుండి కొండపాక పేరుమీద మార్చి తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను విన్నవించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పూరెళ్ల కుమార్, వార్డు సభ్యులు దాట్ల శ్రీనివాస్, కత్తి సురేష్, కొలుగూరి రాజేశ్, కే తిరుపతి, నల్లగాశ కుమారస్వామి, కాసర్ల అనిల్, పాల్గొన్నారు.