 
                                                            Registration | జగిత్యాల కలెక్టరేట్: రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్(https://registration.telangana.gov.in) పనిచేయక పోవడంతో క్రయ విక్రయ దారులు రిజిస్ట్రేషన్ కార్యాలంలో నిరీక్షిస్తున్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్స్ కోసం, ఇతర అవసరాల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చిన క్రయ విక్రయదారులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రతీ రోజు ఎదో ఒక సమయంలో రిజిస్ట్రేషన్ శాఖ సైట్ మొరాయించడం పరిపాటిగా మారింది. ప్రభుత్వానికి అత్యదిక ఆదాయం సమకూర్చే శాఖల్లో మూడో స్థానం లో ఉన్న రిజిష్ట్రేషన్ శాఖ క్రయ విక్రయదారులకు మెరుగైన సేవలందించడం లో మాత్రం నిత్యం విఫలమవుతోందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం ఉదయం నుండే సైట్ మొరాయించడంతో క్రయవిక్రయదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 
                            