పెద్దపల్లి, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా దమాషా ప్రకారం దక్కాలిసిన రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుపుడుతున్నది రెడ్డిలేనని బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కందుల సదాశివ్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పై స్టే వచ్చేలా రెడ్డి సంఘం నాయకులు బీసీలకు వ్యతిరేకంగా కోర్ట్ కేసులు వేశారన్నారు. హైకోర్టు లో కేసుల వేసిన రెడ్డి నాయకులకు డబ్బులు పంపింది, ఈ కేసుల వెనుక ఉన్నది రెడ్డి రాజకీయ నాయకులేనన్నారు. అందుకే రెడ్డి నాయకులు కనీసం బీసీల తరపున సానుభూతిని ప్రకటించలేదని విమర్శించారు.
అందుకే ఇకనుంచి ఎన్నికలలో పోటీచేసే రెడ్డి రాజకీయ నాయకులకు బీసీలను ఓట్లు అడిగే హక్కు లేదని, బీసీలం అందరం కలిసి రెడ్లకు రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా కమిటీ నుంచి బీసీ అన్నదమ్ములకు,అక్క చెల్లెళ్లకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం, అగ్ర కులాల్లో ,ఉన్న బ్రాహ్మణులు, వైశ్యలు, వెలమలు, కమ్మలు, ఇతర అగ్ర కులాలు ఎవ్వరు, బీసీలపై వెయ్యని కేసులు రెడ్లే ఎందుకు వేశారో ఆలోచించాలన్నారు. కేవలం ఒక్క సామాజికవర్గంకి చెందిన వారు చేసే కుట్రలను బీసీలం అందరం గుర్తించి ఎన్నిక ఏదైనా బీసీలు రెడ్లకు ఓటు వేయకుండా బుద్ది చెప్పాలన్నారు.
బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కి 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును అమోదింపచేసేందుకు ఒక్కసారి కూడా ప్రయత్నించలేదని, పైగా కొంతమంది ఆ పార్టీ కి చెందిన రెడ్డి నాయకులు బీసీలకు వ్యతిరేకంగా తెరచాటుగా పని చేసారని విమర్శించారు. బీసీ ద్రోహుల పేర్లు త్వరలోనే బహిరంగగా ప్రకటించి వారిని సామాజికంగా బహిష్కరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చర్లపల్లి సురేష్ గౌడ్, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల అశోక్ పటేల్, పెద్దపల్లి మండల అధ్యక్షుడు సింగారపు రవికుమార్ యాదవ్, ఓదెల మండల అధ్యక్షుడు ఉప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.