రాంనగర్, జనవరి 10: అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు విధి నిర్వహణలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదురొనేందుకు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉండాలని కరీంనగర్ సీపీ వీ సత్యనారాయణ సూచించారు. సమర్థవంతమైన సేవల ద్వారానే గుర్తింపు లభిస్తుందని తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలో సోమవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో ఎదురైన సంక్లిష్ట పరిస్థితుల్లో అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు సంయమనంతో వ్యవహరించి సమర్థవంతమైన సేవలందించారని అభినందించారు. వివిధ రకాల కార్యక్రమాల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లయితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని చెప్పారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులు పరిమిత సంఖ్య కన్నా ఎకువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిషారం, కేసు నమోదు వివరాలను ఏ రోజుకారోజు సీసీటీఎన్ఎస్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ఎస్.శ్రీనివాస్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయసారథి, వెంకటరెడ్డి, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.