RDO Maheshwar | చిగురుమామిడి, మే 17: మండలంలోని ముదిమాణిక్యం గ్రామానికి చెందిన రైతులు బోయిని గణేష్, దేవేంద్ర, కొమురయ్యలు ఇటీవల తన భూమిపై పట్టా భూమికి పాసుబుక్కులు ఇవ్వడం లేదని కలెక్టర్ ఫిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఇరువర్గాల ఫిర్యాదుదారుల సమక్షంలో విచారణ చేపట్టారు. బోయిని కొమురయ్య కుటుంబానికి 2012 నాటికే వారికి 5.07 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు రికార్డు ఉంది. కానీ 215 ప్రభుత్వ సర్వే నెంబర్ లో 0.28 గుంటలకు భూమికి గాను 2013లో పట్టా సర్టిఫికెట్ జారీ చేయడం జరిగిందని , అట్టి సర్టిఫికెట్ కు అందుకు సంబంధించిన రికార్డుల నమోదు కార్యాలయ రికార్డులో నమోదు లేదు.
డిస్ట్రిబ్యూషన్ రికార్డ్ (డిఆర్) లో కూడా లేదని, అసైన్మెంట్ రిజిస్టర్ లో సైతం ఎలాంటి ఆధారాలు లేవన్నారు.పట్టా సర్టిఫికెట్లో 2966 ఫైల్ నెంబర్ వేయడం జరిగిందని డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్లు అప్పటివరకు కనీసం రిజిస్టర్లో పట్టా సర్టిఫికెట్లు నెంబర్ నమోదు కాలేదు అన్నారు. విచారణలో పూర్తిగా అవాస్తవంగా సర్టిఫికెట్ ఉన్న సర్టిఫికెట్ జరిగిందని ఆర్డీవో మహేశ్వర్ వివరించారు. అససైన్మెంట్ పట్టా సర్టిఫికెట్ లో ఎంతవరకు వాస్తవం లేదని అన్నారు. ఇందులో తాసిల్దార్ ముద్ధసాని రమేష్ కు ఏలాంటి సంబంధం లేదన్నారు, ఆరోపణలు నీరాధారం అని తెలిపారు. వీరి వెంట తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఆర్ఐ తార, బాధిత రైతులు, గ్రామస్తులు ఉన్నారు.