చొప్పదండి, మార్చి 20: ఈనెల 23 న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కరీంనగర్ లోని కొండ సత్యలక్ష్మి గార్డెన్లో నిర్వహించే బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని సాయి రెస్టారెంట్లో చొప్పదండి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ ఏ పిలుపునిచ్చిన చొప్పదండి నియోజకవర్గం కార్యకర్తలు ముందుంటారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎలా కొట్లాడామో అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పాలనపై రైతుల కోసం ప్రజల పక్షాన నిలబడి ముందుంటున్నామని అన్నారు.
కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మినుపాల తిరుపతిరావు, మండల పార్టీ అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీపీ చిలుక రవీందర్, మాజీ జెడ్పిటిసీలు ఇప్పనపల్లి సాంబయ్య, మాచర్ల సౌజన్య, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, చీకట్ల రాజశేఖర్, మాజీ సర్పంచులు వెల్మ నాగిరెడ్డి, మామిడి లత, యువజన సంఘాల సమితి అధ్యక్షులు బంధారపు అజయ్ కుమార్, నలుమాచు రామకృష్ణ, గన్ను శ్రీనివాస్ రెడ్డి, గాండ్ల లక్ష్మణ్, మాడూరి శ్రీనివాస్, గొల్లపెల్లి శ్రావణ్ కుమార్, వడ్లకొండ శ్రీనివాస్, బిసవేణి రాజశేఖర్, సీపెల్లి గంగయ్య, వడ్లూరి భూమయ్య, ఎండీ జహీర్, కొత్తూరి నరేష్, నరేష్, రావణ్ పాల్గొన్నారు.