BC Welfare Association | పెద్దపల్లి, అక్టోబర్8: బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి మండల అధ్యక్షుడిగా కాపులపల్లి గ్రామానికి చెందిన సింగారపు రవికుమార్ యాదవ్ నియామకమయ్యారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో రవి కుమార్ యాదవ్‌కు ఆ సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి చర్లపల్లి సురేష్ గౌడ్ నియామక పత్రాన్ని అందించారు.
అలాగే పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామానికి చెందిన కందుల అశోక్ పటేల్‌ను నియమించి నియామక పత్రం అందించారు. బీసీ హక్కులకోసం, విద్యా ఉపాధి, చట్టసభలతో పాటు అన్ని రంగాల్లో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటాకోసం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల సదాశివ, తదితరులు పాల్గొన్నారు.