Take action | రుద్రంగి, జూలై 27: రుద్రంగి మండలానికి చెందిన సిర్రం వెంకటి వారం రోజుల క్రితం రుద్రంగి గ్రామ శివారులోని నందివాగు వద్ద రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిగా సిర్రం వెంకటి బంధువు అయిన ఆధరవేణి వినోద్ హత్య చేశాడంటూ వెంకటి కుటుంబ సభ్యులు ఆదివారం రుద్రంగిలోని ఇందిరాచౌక్లో కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వెంకటి అనుమానాస్పదంగా మృతి చెందగా, పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని మృతుని భార్య కొమురవ్వ, కుమారుడు మహేంధర్, కూతురు మంజుల, కుటుంబ సభ్యులు ఆరోపించారు.
గతంలో తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో పథకం ప్రకారంగా హత్య చేశారని ఆరోపించారు. సంఘటన స్థలానికి ఎస్సై శ్రీనివాస్ చేరుకొని బాధితులతో మాట్లాడి బాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సిర్రం వెంకటి కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు. సిర్రం వెంకటి మృతిని అనుమానాస్పదంగా మృతి కేసుగా నమోదు చేశామని, హత్యా లేక ప్రమాదమా అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.