Sircilla | రాజన్న సిరిసిల్ల, మే 14 ( నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని భీవండిలో ఇటీవలే నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలుపొందడంతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈక్రమంలో తొలిసారిగా మహారాష్ట్రలోని భీవండిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తొలిసారిగా విచ్చేసిన సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ కు అక్కడితెలంగాణ ప్రజలు, పద్మశాలీసంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం భీవండి అఖిల పద్మశాలీ సంఘం, భజరంగ్ దళ్ సభ్యులు, ఎస్డీవీ ఫౌండేషన్ సభ్యులు జ్ఞాపికలను అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ స్థాయికి ఎదిగినా మన మూలాలను మర్చిపోకూడదని, పద్మశాలీ బిడ్డ ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉంది అంటూ భీవండి సమాజం కురిపించిన ఈ ప్రేమ, చేసిన సన్మానం తన జీవితంలో మరిచిపోలేనిదని పేర్కొన్నారు. భీవండి అఖిల పద్మశాలీ సంఘం, బజరంగ్ దళ్, ఎస్డీవీ ఫౌండేషన్ నిర్వాహకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పుట్టపర్తి రామకృష్ణ, మల్లేశం, రాజేష్, కొంక మల్లేశం, రాజేశం, గాజేంగి రాజు, గడ్డం మహేందర్,లక్ష్మీనారాయణ, దేవయ్య, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.