విద్యానగర్, ఏప్రిల్ 27: హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో బైపాస్ సర్జరీ బదులుగా అత్యంత అరుదైన కాంప్లెక్స్ కరోనరీ స్టెంటింగ్ ద్వారా మహిళలకు విజయవంతంగా మూడు స్టంట్లు వేసినట్లు యశోద హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ వైద్యులు డాక్టర్ జగదీశ్ మాదిరెడ్డి తెలిపారు.
ఆదివారం నగరంలోని యశోద హాస్పిటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కరీంనగర్‌కు చెందిన విజయ వద్ధాప్యం దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెకు గుండె సమస్య రావడంతో యశోద హాస్పిటల్‌కు వచ్చారని, వెంటనే అంజియోగ్రామ్ చేయగా మూడు వాల్వ్‌లు బ్లాకు ఉన్నట్లు గుర్తించామన్నారు.
ఆమెకు బైపాస్ సర్జరీ చేయడం హైరిస్క్‌తో కూడుకోవడం వల్ల అత్యాధునిక కాంప్లెక్స్ కరోనరీ స్టెంటింగ్ ద్వారా విజయవంతంగా చికిత్స అందించినట్లు తెలిపారు. హైరిస్ కార్డియాక్ కేసుల చికిత్సలో యశోద హాస్పిటల్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పేషెంట్ విజయ మాట్లాడుతూ.. తనకు బైపాస్ సర్జరీ అవసరమైనప్పటికీ తన వయస్సును దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక చికిత్స అందించిన యశోద వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.