వేములవాడ, నవంబర్ 27: పట్టణంలోని 21వ వార్డులో గల కేదారేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 35 ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు కేదారేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, అన్నదానం చేయడం సంతోషకరమన్నారు. అన్నిదానాలోకెల్లా అన్నదానం గొప్పదన్నారు. సూమారు వెయ్యి మందికి అన్నదానం చేసిన కౌన్సిలర్ నరాల శేఖర్, కాలనీ పెద్దలను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి, కౌన్సిలర్లు నరాల శేఖర్, మారం కుమార్, అన్నారం ఉమారాణి, కోఆప్షన్ సభ్యుడు కట్కూరి శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులు పుల్కం రాజు, ఏఎంసీ డైరెక్టర్ చేపూరి రవి, నాయకులు గడ్డం హన్మాండ్లు, కాలనీవాసులు డాక్టర్ మనోహర్, బుస్స దశరథం, దైత కుమార్, బోడ్ల అశోక్, తిరుమల్‌గౌడ్ ఉన్నారు.
2లక్షల ఎల్వోసీ అందజేత
చందుర్తి, నవంబర్ 27: చందుర్తి మండలం మూడపల్లికి చెందిన దుమ్ము రమేశ్ హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో అనారోగ్యంతో చికత్స పొందుతుండగా, బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఆదివారం 2లక్షల ఎల్వోసీ పత్రాన్నిఅందించారు. ఇక్కడ సర్పంచ్ చిలుక అంజిబాబు, ఏఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, నాయకుడు బైరగోని రమేశ్ ఉన్నారు.