Ramagundam| జ్యోతినగర్, ఆగస్టు 13: శ్రావణమాసం వేళ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో రామగుండం మండల కేంద్రం సమీపంలోని రామునిగుండాల జలపాతం బుధవారం కనువిందు చేస్తోంది. ఎతైన కొండ మీదుగా వర్షపు నీరు రామునిగుండాల్లో పరవల్లుగా జలపాతం జాలువారడంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. శ్రావణ మాసంతో భక్తల తాకిడి ప్రారంభమైంది. రామునిగుండాల సందర్శనతో స్నానం ఆచరించి జలపాతంను తిలకిస్తున్నారు.