Ramagundam | కోల్ సిటీ, అక్టోబర్ 3: రామగుండం నగర పాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్-2025లో ఉత్తమ ర్యాంకు సాధించడమే ధ్యేయమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ జే.అరుణ శ్రీ అన్నారు. పక్షం రోజుల పాటు నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా ముగింపు పురస్కరించుకొని ఉత్తమ సేవలందించిన పారిశుధ్య సిబ్బందికి నగర పాలక సంస్థ కార్యాలయంలో శాలువాల కప్పి సన్మానించి, మెమెంటోలు బహుకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ లో మెరుగైన మార్కులు సాధించడానికి అవసరమైన అన్ని అంశాలపై దృష్టి సారించాలన్నారు.
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పారిశుధ్యంను మెరుగుపర్చాలన్నారు. కాగా, సత్కారం అందుకున్న వారిలో డ్రైయిన్ క్లీనర్లు అవినాష్, రాజు, వెంకటేష్, రమేష్, సారయ్య, విశ్వనాధ్. నాయక్, మల్లేష్, సదయ్య, కొంరయ్య, లింగమూర్తి, పోషం, కంపోస్టు యార్డు ఆపరేటర్ ప్రకాశ్, జవాన్లు తిరుపతి, సారయ్య, దయానంద్, వెహికిల్ ఇన్ఛార్జి నరేశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, నాగభూషణం, పీఆర్ఓ కుమార్ ఉన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.