Kandula Sandhyarani | కోల్ సిటీ, నవంబర్ 7: పోచమ్మను కొట్టినోడు కొసెల్లని, ఆ మూర్ఖులంతా మట్టిలో కొట్టుకుపోతారని, రామగుండం ఎమ్మెల్యే రాజీనామా చేయాని బీజేపీ రామగుండం నియోజక వర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో వివిధ ప్రాంతాలలో కూల్చివేసిన మైసమ్మ గుళ్లను శుక్రవారం ధర్నా అనంతరం ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ మైసమ్మ, వేలుపమ్మ, పోచమ్మ గుళ్లు కూల్చివేయడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
సంఘటనకు కారకులు ప్రజా క్షేత్రంలోకి వచ్చి క్షమాపణ చెప్పేదాకా వదిలేది లేదన్నారు. గ్రామ దేవతల గుళ్లను కూల్చి హిందూ మనోభావాలను దెబ్బతీసినోళ్లు భస్మం అవుతారన్నారు. రామగుండంలో ఔరంగ జేబు పాలన సాగుతుందని ఆరోపించారు. ఈ సంఘటనలకు ఎమ్మెల్యే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తుగ్లక్ పాలనకు ప్రజలు బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆమె వెంట నాయకులు భూమయ్య, బాలు, హర్ష, శ్యాం కుమార్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.