విద్యానగర్, మే 16: డెంగీ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత అన్నారు. గురువారం సుభాష్‌నగర్ బుట్టి రాజారాం కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా తీసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ఏడిస్ దోమకాటు ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరం శరీరంపై దద్దుర్లు, కండరాలు కీళ్ల నొప్పులు రక్తస్రావం వ్యాధి లక్షణాలు అని తెలిపారు. డెంగ్యూ దోమలు కూలర్లు పాత టైర్లు ప్లాస్టిక్ వస్తువులు కొబ్బరి బొండాలు పూలతో వృ ద్ధి చెందుతాయన్నారు.
ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవాలన్నారు. డ్రైడే ఫ్రైడే ను పాటించాలని అన్నారు. 2010 సంవత్సరం నుంచి ప్రజలలో డెంగీ వ్యాధిపై అవగాహన కల్పించి ప్రభుత్వ ఆదేశాల మేర కు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గతేడాది జిల్లాలో 2 డెంగ్యూ కేసులు నిర్ధారణ అ య్యాయని, ఈ సంవత్సరం ఇప్పటివరకు 23 డెంగీ కేసులు నిర్ధారణ అయినట్లు చెప్పారు. ప్రజలు తమ ఇండ్లు ఇంటి పరిసరాల్లో రాబోయే వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకొని దోమల వ్యాప్తిని నివారించడంతో డెంగ్యూ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చు నన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జూవేరియా, డీఐవో డాక్టర్ సా జీదా, డెమో రంగారెడ్డి హెచ్ ఈ కైక ,సీహెచ్ఓ నాగేశ్వర్, రామనాథం ,మల్లయ్య, సబ్ యూనిట్ ఆఫీసర్లు లింగయ్య, సంతోష్ ,లక్ష్మి తదితరులు ఉన్నారు.
హుజూరాబాద్‌టౌన్, మే16: జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా గురువా రం హుజూరాబాద్ చెల్పూర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది ర్యాలీ తీశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డా క్టర్ చందు మాట్లాడుతూ భారతదేశంలో మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటారన్నారు. ఇండ్ల పరిసరాలను ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలన్నారు. శుద్ధమైన నీటినే తాగాలని సూచించారు. ర్యాలీలో మెడికల్ ఆఫీసర్ మధూకర్, సీహెచ్ఓ సాజిద్ ఉన్నారు.
జమ్మికుంట, మే16: జాతీయ డెంగీ దినోత్సవాన్ని జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ర్యాలీ తీశారు. డెంగీ వ్యా ధి నివారణ చర్యలపై నినాదాలు చేశారు. దోమల నివారణకు అనుసరించాల్సిన విధానాలు వివరించారు. ఇక్కడ వైద్యులు పర్హానుద్దీన్, కార్తీక్, మహోన్నత, హిమబిందు, చందన, సంధ్యారాణి, సీహెచ్‌వో శంకర్‌రెడ్డి, సూపర్వైజర్లు రత్నకుమారి, అరుణ, స్వరూప, సదానందం ఉన్నారు.
వీణవంక, మే 16: జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆ ధ్వర్యంలో వైద్య సిబ్బంది గురువారం వీ ధుల గుండా వగాహన ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా డా.వరుణ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.