Tribal Sarpanches Forum | జగిత్యాల : జగిత్యాల జిల్లా గిరిజన సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ఫోరం జిల్లా అధ్యక్షుడిగా గుగులావత్ రాజేందర్ ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా గుగులోత్ వినోద్ నాయక్, ఉపాధ్యక్షుడిగా భూక్య తిరుపతి నాయక్, ప్రధాన కార్యదర్శులుగా బానోత్ రమేష్ నాయక్, పరచ శంకర్ ఎంపికయ్యారు. కార్యదర్శులుగా మాలోత్ తిరుపతి, బోడ సాగర్, కోశాధికారిగా రామ్ చందర్, సుధాకర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
కార్యవర్గ సభ్యులుగా గణేష్ నాయక్, అపోవత్ రాజు, సురేందర్ నాయక్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన సర్పంచుల సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, గిరిజన గ్రామాల సమస్యల పరిష్కారం, సర్పంచుల హక్కులు, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.