సిరిసిల్ల రూరల్,ఫిబ్రవరి 24 : కొద్ది రోజుల క్రితం అక్రమంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన సామాన్య రైతు అబ్బాడి రాజిరెడ్డి కుటుంబ సబ్యులను జిల్లా రెడ్డి సంఘం నేతలు(Reddy Sangham) పరామార్శించారు.ఈ మేరకు సోమవారం వారి నివాసానికి వెళ్లి ధైర్యం చెప్పారు. రాజిరెడ్డి కుటుంబానికి జిల్లా రెడ్డి సంఘం అండగా ఉంటుందని భరోసా నిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు గుండారం కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎగుమామిడి కృష్ణారెడ్డి, గుండ్లపెళ్లి నరసింహారెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు ఎడుమల భూపాల్ రెడ్డి, మండల రెడ్డి సంఘ అధ్యక్షుడు వేసిరెడ్డి రామిరెడ్డి, సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, జిల్లా రెడ్డి సంఘ బాధ్యులు బిచ్చల రాజిరెడ్డి, కంది భాస్కర్ రెడ్డి,ప్రేమ్ సాగర్ రెడ్డి,అబ్బాటి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.