Siricilla BRS | సిరిసిల్ల టౌన్, జూన్ 22:పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్లలో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రస్తుతం మీరు ఉంటున్న ఏఎంసి భవనం కేటీఆర్ హయాంలో నిర్మించిందేనని గుర్తుం కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి పనులు చేయడం చేతగాకనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల ముందే ఉందన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చుకోవాలన్నారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో పట్టణాభివృద్ధికి చేసిందేమిటో చెప్పాలని సవాల్ విసిరారు. మా పాలకవర్గం హయాంలో ఇచ్చిన నిధులను కాంగ్రెస్ నేతలు తెచ్చినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
విమర్శలు అనేవి రాజకీయంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఏఎంసీ చైర్మన్ హోదాలో ఉన్నామని అహంభావంతో మాట్లాడిని తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మేమెక్కడా వ్యక్తిగతంగా ఆరోపణలు, విమర్శలు చేయలేదన్నారు. చదువు ఉంటే సరిపోదని సంస్కారం కూడా ఉండాలని హితవుపలికారు. వార్డు అభివృద్ధి విషయంలో తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఐదేండ్ల పాలకవర్గంలో అనేక నిదులు తెచ్చి అభివృద్ధి చేశామని తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో మేము అందరికీ సమానంగా పనులు చేసిపెట్టామన్నారు. మున్సిపల్లో అవినీతి జరిగిందంటూ మీరు చేసిన ఆరోపణలు దమ్ముంటే రుజువు చేయాలన్నారు. పదవులు ఎప్పటికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు.
వ్యక్తిగతంగానే మాట్లాడతామంటే మేము కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకురాలు సావిత్రి మాట్లాడుతూ తమ నాయకుడు చక్రపాణిని ఉద్దేశిస్తూ ఏఎంసి చైర్మన్ స్వరూప చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేటీఆర్ నాయకత్వంలో సిరిసిల్లను అభివృద్ధిలో నిలిపిన నాయకుడు చక్రపాణి అని కొనియాడారు. తండ్రి వయసున్న వ్యక్తిపై ఇటువంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సన్నబియ్యం మీ ఇంట్లో నుండి ఇవ్వడంలేదని గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదని మాట్లాడిన మీరు కాంగ్రెస్ వచ్చాక చేసిన అభివృద్ధి ఏంటో చూపాలన్నారు. రాబోవు ఎన్నికలలో గెలవబోమని కాంగ్రెస్ నేతలకు అర్థమైందన్నారు. ప్రజలకు ఏ ఒక్క హామిని అమలుచేయడం లేదన్నారు. మరోసారి మా నాయకుడు చక్రపాణిపై ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మహిళా నాయకులు పోచవేని సత్య, కల్లూరి లత, అరుణ, సీమాబేగం, గాజుల జ్యోతి, ఆస్మా, తదితరులున్నారు.