గంభీరావుపేట: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా గెలిసిన రమణను శనివారం పద్మశాలి సంఘం సభ్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ మండల అధ్యక్షుడు మేర్గు నాగభూషణం, ప్రధాన కార్యదర్శి యెల్లె బాలకృష్ణ, గంభీరావుపేట గ్రామ అధ్యక్షులు యెల్లె దేవేందర్, కార్యదర్శి శ్రీగాధ గణేష్, సభ్యులు మేర్గు రమేష్, వాసం శ్రీనివాస్, దేవయ్య తదితరులు ఉన్నారు.