తిమ్మాపూర్ రూరల్, జూలై 24: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఎల్ఎండీలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించగా పలువురు నాయకులు, అభిమానులు రక్తదానం చేశారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. సేకరించిన రక్తాన్ని రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులకు అందజేస్తామని తెలిపారు. మంత్రి కేటీఆర్‌తో రాష్ర్టానికి ఎంతో పేరు వచ్చిందన్నారు. విదేశీ కంపెనీలను తెలంగాణకు తీసుకువచ్చి, ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. ఈ వేడకల్లో సిరిసిల్ల జడ్పీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సల్ల రవీందర్, నాయిని వెంకట్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, యాదగిరి వెంకటేశ్వర్రావు, ఎలుక అనిత-ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.