ఎములాడ కిటకిట

- రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం
- శివనామస్మరణతో మార్మోగిన ఆలయం
వేములవాడ టౌన్, డిసెంబర్ 6: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆల యం సోమవారం భక్తులతో పోటెత్తింది. భక్తుల శివనామస్మరణతో ఆలయం మా ర్మోగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వేకువజామునే పవిత్ర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ అధికారులు ఆర్జితసేవలను రద్దు చేసి లఘు దర్శనం ఏర్పాటు చేశారు. రాజన్నను సుమారు 35 వేల మందికి పైగా దర్శించుకున్నారని, ఆర్జిత సేవల ద్వారా సుమారు రూ.17 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
30రోజుల్లో 8.94కోట్లు
రాజన్న ఆలయానికి భారీ ఆదాయం వచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 30 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 8 కోట్ల 94 లక్షల 61,011 సొమ్ము సమకూరింది. గత నెల 5వ తేదీ నుంచి ఈ నెల 4వతేదీ దాకా కార్తీక మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయానికి హుండీ ద్వారా 3కోట్ల 54 లక్షల 46వేల 446, కోడె టిక్కెట్ల ద్వారా కోటి 92లక్షల 85వేల 247, ప్రసాదాల ద్వారా కోటి 66లక్షల 95వేల 560, వసతిగదుల ద్వారా 34లక్షల 69వేల 382, రుద్రాభిషేకం ద్వారా 12లక్షల 63వేల 400, శీఘ్రదర్శనం టిక్కెట్ల ద్వారా 33లక్షల90వేల600, కల్యాణ టిక్కెట్ల ద్వారా 48లక్షల 10వేలు, కేశఖండనం టిక్కెట్ల ద్వారా 8లక్షల 83వేల 520, బద్దిపోశమ్మ ఆలయం ద్వారా 12లక్షల 80వేల 520, ఇతర ఆర్జితసేవల ద్వారా 29లక్షల 36వేల 336.. మొత్తంగా 8 కోట్ల 94 లక్షల 61,011 సమకూరినట్లు ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

