Heart attack | స్నానం చేస్తుండగా గుండెపోటు రావడంతో ఓ మాజీ ఎంపీటీసీ మృతి చెందిన విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బొల్లి లింగం ( 70) ఇవాళ ఉదయం 5 గంటలకు స్నానం చేస్తుండగా గుండెపోటు వచ్చి కింద పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
లింగం 2001లో ఎంపీటీసీగా విధులు నిర్వహించి గ్రామం అభివృద్ధి కోసం కృషి చేశాడు. ఆయనకు భార్య హనుమవ్వ, ఇద్దరూ కూతుర్లు ఉన్నారు. లింగం మృతి పట్ల సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందే బాలయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు.