BRS : ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ గుర్రం విశాఖ్తో పాటు పలువురు వార్డ్ మెంబర్లు కేటీఆర్ (KTR) సమక్షంలో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీలో చేరారు. హైదరాబాదులోని నివాసంలో కేటీఆర్‌ను కలిసి, ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
గులాబీ పార్టీలో చేరిన వారిలో ఉపసర్పంచ్ గుర్రం విశాఖ్, వార్డ్ మెంబర్లు ఉల్లి దేవరాజు, మేడతన్నపేట సాగర్, అంకం శ్రీనివాస్‌ల ఉన్నారు. వీరితో పాటు గ్రామానికి చెందిన మొగుళ్ల శ్యామ్, మొగుళ్ల సన్నీ, గుర్రం భాస్కర్, జంపెల్లి నరేష్, మొగుళ్ల శ్రావణ్ సైతం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మొగుళ్ల గోపాల్, చెరుకూరి శ్రీశైలం, చెరుకూరి రాజేష్, గ్రామ యూత్ ప్రెసిడెంట్ గుర్రం భరత్, జానపల్లి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.