రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీబద్దిపోచమ్మ ఆలయంలో భక్తులు మంగళవారం ఘనంగా బోనాలు సమర్పించారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం నెత్తిన బోనంతో బారులు తీరారు. అమ్మవారికి కల్లుపోసి, సారెపెట్టి బోనాలు సమర్పించారు. దీంతో బద్దిపోచమ్మ వీధి భక్తులతో సందడిగా కనిపించింది.