కేశంపేట, ఫిబ్రవరి 23 : కేశంపేటలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఎద్దులతో బండలాగుడు పోటీలను నిర్వహించగా, గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కేశంపేట శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఎద్దులతో బండలాగుడు పోటీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పోటీలను స్థానిక ఎంపీపీ రవీందర్‌యాదవ్ ప్రారంభించారు. పోటీల్లో పలు ప్రాంతాల నుంచి 5 జతల ఎద్దులతో పోటీదారులు పాల్గొన్నారు. పోటీలను చూసేందుకు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, నవీన్‌కుమార్, ఎంపీటీసీలు యాదయ్యచారి, మల్లేశ్‌యాదవ్, జడ్పీటీసీ విశాల, వైస్ ఎంపీపీ అనురాధ, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ విశ్వనాథం పాల్గొన్నారు.