Rainwater | సిరిసిల్ల రూరల్, ఆగస్టు 10: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో ఆదివారం ఉదయాన్నే కురిసిన భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరాయి. గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంతం లో ఉంటున్న వారి ఇళ్లలోకి వరద లా వచ్చి, ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. వర్షపు నీరు ఇంట్లోకి రావడంతో పిల్లలతో ఆరుబయటకు వచ్చారు.
వర్షపు నీరు తో గత కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నా పంచాయితీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో పిల్లలు, తాము జ్వరాల బారిన పడుతున్నామని, ఆరుబయటే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇళ్లలోకి పాములు, తెల్లు, విష పురుగులు ఇల్లోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంభందిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.