Rahul Gandhi birthday | జగిత్యాల, జూన్ 19: లోక్ సభ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ కేక్ కట్ చేసి, పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత దేశ భవిష్యత్ ఆశా జ్యోతి రాహుల్ గాంధీ అని, త్యాగాల కుటుంబం నుండి వచ్చిన నాయకుడు ప్రధాన మంత్రి పదవి అవకాశం వచ్చినా దేశం కోసం పార్టీ కోసం పనిచేస్తున్నారనీ పేర్కొన్నారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పునాది వేసింది, రాహుల్ గాంధీ, తాత జవహర్ లాల్ నెహ్రూ అని తెలిపారు. దేశంలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు లేదని, ప్రతిపక్ష నాయకుడుగా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రజల పక్షాన ఉన్నారని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువల జ్యోతి లక్ష్మణ్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, తాజా మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.