వెల్గటూర్ : జగిత్యాల (Jagtial ) జిల్లా ఎండపల్లి మండలం గుడిసెల పేట గ్రామం ( Gudisela Peta village) లో బుధవారం పిచ్చికుక్కలు ( Rabid dogs ) వీర విహారం చేసి ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాయి. గుడిసెల నరసమ్మ ముఖంపై తీవ్రంగా గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురిని చాతిలో , తలకు, ముఖం, కాళ్లకు పై దాడి చేయగా గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటినా అంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ దవఖానాకు తరలిoచి చికిత్స అందిస్తున్నారు.