Quality in teaching | రుద్రంగి, సెప్టెంబర్ 11: స్కూల్ కంప్లెక్స్ సమావేశాలతో ఉపాధ్యాయులు అందించే బోధనలతో నాణ్యత పెరుగుతుందని రుద్రంగి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు సమ్మిరెడ్డి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, రుద్రంగి, చందుర్తి మండలాల హింది ఉపాధ్యాయులతో కంప్లెక్స్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి, పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. స్కూల్ కంప్లెక్స్ సమావేశాలతో ఉపాధ్యాయుల అనుభవాలను పంచుకోవడం, ఉత్తమ పద్ధతుల ద్వారా విద్యాబోధన, భాగస్వామ్య అభ్యాసన సంస్కృతిని పెంపొందుతుందన్నారు. దీంతో బోధన సులభతరమై విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, రుద్రంగి, చందుర్తి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.