కరీంనగర్ రూరల్, డిసెంబర్ 28: సాధారణంగా మనం పాము పేరు వింటేనే భయపడిపోతాం.. సమీపంలోకి వస్తే పరుగులు పెడుతాం.. కానీ, తీగలగుట్టపల్లికి చెందిన షేక్ షాహిదా మాత్రం అలా కాదు! అది ఎలాంటి పామైనా భయపడకుండా పట్టేస్తుంది. శనివారం తీగలగుట్టపల్లి ఊర చెరువు ప్రాంతంలోని రాజయ్య ఇంటి వద్ద మురుగుకాలువలో కొండచిలువ కనిపించింది. స్థానిక నాయకుడు కాశెట్టి శ్రీనివాస్ సమాచారం అందించడంతో షేక్ షాహిదా అక్కడకు చేరుకొని, ఆ పామును పట్టుకున్నది. తర్వాత అటవీ అధికారులు కొండ చిలువను తీసుకెళ్లి, ఆర్నకొండ అడవిలో వదిలేశారు.